వెలిగొండ నిర్వాసితుల ప్యాకేజీ చెల్లింపులపై స్పష్టతనిచ్చిన కమిషనర్ ప్రశాంతి

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటివరకు ఏడువందల యాభై ఎనిమిది కోట్ల ముప్పై ఒక లక్ష రూపాయలు చెల్లించినట్లు పునరావాస కమిషనర్ ప్రశాంతి వెల్లడించారు. మిగిలిన కుటుంబాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే నష్టపరిహార ప్యాకేజీ అందిస్తామని ఆమె స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వివిధ దశల్లో ఉందని, మార్కాపురంలో ప్రత్యేకంగా ఈ పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.