'తీర్పు రిజర్వ్': ఏపీలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కీలక విచారణ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోల చట్టబద్ధతపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. చీఫ్ జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించి తీర్పును రిజర్వ్ చేసింది. కమిషన్ నియామక ఉత్తర్వులు, సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.