చేనేత పింఛన్ల దరఖాస్తు నిబంధనలు సరళతరం చేసిన ఏపీ ప్రభుత్వం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికుల పింఛన్ దరఖాస్తు నిబంధనలను ప్రభుత్వం సరళతరం చేసింది. బ్యాంక్ స్టేట్‌మెంట్ సమర్పించాలన్న నిబంధనను మినహాయించింది. దీనికి బదులుగా మాస్టర్ వీవర్ సర్టిఫికెట్ మరియు వేతన వివరాల పత్రాన్ని ఇస్తే సరిపోతుందని మంత్రి సవిత స్పష్టం చేశారు. 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలు ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.