చిట్వేల్లో పాఠశాలల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
చిట్వేల్ పీహెచ్సీ వైద్యాధికారి డా. ఎం. శివప్రసాద్ గౌడ్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈనెల 25న డీవార్మింగ్ డే సందర్భంగా 13 సచివాలయాల పరిధిలోని ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు ప్రతి పాఠశాలను సందర్శించి హెచ్ఎంలకు మాత్రలు అందజేశారు. చిట్వేల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జ్ హెచ్ఎం సోఫియాకు మాత్రలు అందించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఇస్మాయిల్ బాషా, ఎంఎల్హెచ్పీ కల్పన, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.