అహోబిలం క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే అఖిలప్రియ
రిపోర్టర్: రాము
స్థలం: నంద్యాల
ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. ఎగువ అహోబిలంలో రూ.3.5 కోట్ల నిధులతో చేపట్టనున్న మండపాల నిర్మాణ పనులకు ఆమె భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర నిధులతో ఆలయ పరిసరాల్లో భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, గత వైకాపా పాలకులు అహోబిలాన్ని కేవలం రాజకీయాలకే వాడారని తీవ్రంగా విమర్శించారు.