2027 నుంచి నీట్ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహణ

రిపోర్టర్: సతీష్ స్థలం: India

నీట్ యూజీ 2027 పరీక్షను పెన్ అండ్ పేపర్ విధానం నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)గా మార్చేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిద్ధమైంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే ఈ పరీక్ష కోసం, తగిన ఐటీ మౌలిక సదుపాయాలున్న ప్రభుత్వ విద్యా సంస్థలను గుర్తించాలని ఏఐసీటీఈని ఎన్టీఏ కోరింది. ఇకపై ఓఎంఆర్ షీట్లకు బదులుగా డిజిటల్ స్క్రీన్లపైనే విద్యార్థులు సమాధానాలు నమోదు చేయాల్సి ఉంటుంది.