ఆన్లైన్ పార్ట్ టైమ్ జాబ్ మోసం: భారీగా డబ్బు నష్టపోయిన మహిళా లెక్చరర్
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
సోషల్ మీడియాలో వచ్చిన పార్ట్ టైమ్ జాబ్ ప్రకటనను నమ్మి అమరావతికి చెందిన మహిళా లెక్చరర్ ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు నష్టపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆన్లైన్ రేటింగ్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఖాళీ సమయంలో సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో మోసగాళ్ల వలలో చిక్కుకుని తీవ్రంగా నష్టపోతున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.