సంగారెడ్డిలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభం

రిపోర్టర్: సతీష్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లాలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ తరగతులు ఈనెల పన్నెండో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఎస్పీ సంగారెడ్డి (SP Sangareddy) వెల్లడించారు. ఉదయం తొమ్మిది గంటలకు ఈ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొంటూ, అభ్యర్థులు అందరూ తమకు కేటాయించిన కేంద్రాలకు సకాలంలో హాజరుకావాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ చక్కటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కోరారు.