అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన ప్రియాంక
రిపోర్టర్: హరి
స్థలం: మహారాష్ట్ర
కెనడా వేదికగా జరిగిన కామన్వెల్త్ మహిళల పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో జూనియర్ విభాగంలో భారత్కు చెందిన ప్రియాంక పరేఖ్ స్వర్ణ పతకం సాధించినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రకు చెందిన ఈ పవర్ లిఫ్టర్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశం గర్వపడేలా చేసిందని నిర్వాహకులు తెలిపారు. వ్యాయామంపై ఆసక్తితో రంగంలోకి అడుగుపెట్టి అనతికాలంలోనే అద్భుత విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తిని సమున్నతంగా నిలబెట్టడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.