తిరుమల శ్రీవారి భక్తులకు కీలక అలర్ట్: ఎస్ ఎస్ డి టోకెన్లు రద్దు

రిపోర్టర్: రాజేష్ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ ల వద్ద బుధవారం జారీ చేయాల్సిన సర్వదర్శన టోకెన్లను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వరుస వర్షాలు మరియు ఎన్నికల నేపథ్యంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని, టోకెన్లు చాలా సులువుగా దొరుకుతున్నాయని తెలిపారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి ముందురోజు ఇచ్చే టోకెన్లను గురువారం యథావిధిగా జారీ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.