నిరుద్యోగులకు గుడ్ న్యూస్: హర్యానాలో ఎనిమిది వేల ఉద్యోగాల భర్తీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: చండీగఢ్
హర్యానాలో వివిధ ప్రభుత్వ శాఖలలో సుమారు ఎనిమిది వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు హర్యానా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ హిమ్మత్ సింగ్ వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. గ్రూప్ సీ మరియు గ్రూప్ డీ పోస్టుల భర్తీ కోసం నిర్వహించనున్న ఈ ప్రక్రియకు అభ్యర్థులు హర్యానా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్కోర్ కార్డు కలిగి ఉండటం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.