ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి: డా చినుకని శివ ప్రసాద్

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

దేవీ నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలందరికీ సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివ ప్రసాద్ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, సిరిసంపదలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పవిత్ర దినాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని శివ ప్రసాద్ కోరారు.