అక్రమ రాజకీయాలపై కాంగ్రెస్ బీజేపీలను నిలదీసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ దిశానిర్దేశంలో చేసిన న్యాయపోరాటానికి తగిన ఫలితం దక్కిందన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెరవెనుక చీకటి ఒప్పందాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ న్యాయపోరాటం ఆగదని స్పష్టం చేశారు.