యానాం వద్ద గోదావరిలో చిక్కిన 23 కిలోల భారీ పండుగప్ప!
రిపోర్టర్: నరేష్
స్థలం: పుదుచ్చేరి
యానాం వద్ద గౌతమి గోదావరిలో మత్స్యకారుల గేలానికి 23 కిలోల భారీ పండుగప్ప చిక్కింది. రాజీవ్ బీచ్‌లోని చేపల వేలం కేంద్రంలో మత్స్యకార మహిళ కోలాటి దేవి దీనిని రూ.15 వేలకు దక్కించుకున్నారు. ఇంత బరువున్న చేప దొరకడం అరుసని, దీని కూర ఎంతో రుచికరంగా ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. ఈ భారీ చేపను కోలంక గ్రామానికి చెందిన వ్యక్తికి విక్రయించినట్లు ఆమె వెల్లడించారు.