చీలపల్లి బ్రిడ్జి నిర్మాణానికి ఐరన్ రాడ్లు పంపిన కాంగ్రెస్ నేత
రిపోర్టర్: jaleel sakshi
స్థలం: సిర్పూర్ (టి)
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలంలోని చీలపల్లి బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన ఐరన్ రాడ్లను డీసీఎం వ్యాన్లో మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి శ్రీమతి అధిత ఇచ్చిన మాట ప్రకారం పంపించారు. బ్రిడ్జి సమస్యతో ఎన్నో ఏళ్లుగా మూడు గ్రామ పంచాయతీల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆమె ముందుకు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.