అల్లూరి మన్యంలో గిరిజన రైతుల కోసం కుసుమ సాగు ప్రయోగం

రిపోర్టర్: కృష్ణ స్థలం: Alluri Sitharama Raju

అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంత రైతాంగానికి వ్యవసాయ శాఖ సరికొత్త నూనెగింజల పంట అయిన కుసుమను పరిచయం చేస్తోందని చింతపల్లి వ్యవసాయ శాఖ ఏడీ బీవీ తిరుమలరావు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చింతపల్లి డివిజన్లోని మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా వంద ఎకరాల్లో దీనిని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నట్లు చెప్పారు. తక్కువ నీటితో, మంచు తేమతో పండే ఈ పంటకు పశువుల బెడద ఉండదని, గిరిజనులకు మంచి లాభాలు వస్తాయని పేర్కొన్నారు.