కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని కొనియాడిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమ నేత, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సమాజానికి, చేనేత వర్గాల అభ్యున్నతికి బాపూజీ చేసిన పోరాటాలు, త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.