ఓటర్ల జాబితా సవరణపై నోటీసులు వస్తే కంగారు పడవద్దని ఈసీ స్పష్టీకరణ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై నెలకొన్న గందరగోళానికి కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. నోటీసులు అందుకున్న ఓటర్లు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్కుమార్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం బీఎల్వోలే స్వయంగా ఓటర్ల ఇళ్లకు వచ్చి డాక్యుమెంట్లు సేకరిస్తారని ఆయన తెలిపారు. పౌరులపై ఎలాంటి భారం పడకుండా ఈ సులభతర విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు ఈసీ వెల్లడించింది.