ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ స్పిన్నర్లకు కోచ్ గా రమేష్ పవార్
రిపోర్టర్: రాము
స్థలం: India
భారత మాజీ క్రికెటర్ రమేష్ పవార్ ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుకు స్వల్పకాలిక స్పిన్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. రాజ్ కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో ఆస్ట్రేలియా యువ స్పిన్నర్లకు ఆయన మెళకువలు నేర్పుతున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తాను ఈ బాధ్యతలు చేపట్టానని, భారత్ తో జరిగే చివరి యూత్ వన్డే వరకు జట్టుతోనే ఉంటానని పవార్ తెలిపారు.