కమీషన్ల బాగోతం బట్టబయలంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేసీఆర్ తీవ్ర నిప్పులు
రిపోర్టర్: సతీష్
స్థలం: Telangana
రేడియల్ రోడ్ల టెండర్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదిహేను శాతం కమీషన్ల బాగోతానికి పాల్పడుతోందని బిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమీషన్లు వసూలు చేస్తూ కేవలం తన బినామీలకే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారంటూ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాసిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరాయని, ప్రజాధనాన్ని కొల్లగొడుతూ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడుతూ ఈ మేరకు కేసీఆర్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.