భారీ వర్షాల హెచ్చరిక నేపధ్యంలో ఐదు జిల్లాలకు సెలవు
రిపోర్టర్: విజయ్
స్థలం: Andhra Pradesh
భారీ వర్షాల హెచ్చరికల నేపధ్యంలో ఐదు జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలలో రేపు అంటే సెప్టెంబర్ 23వ తేదీన పాఠశాలలు మరియు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఎవరూ అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.