టాలీవుడ్ సింగర్ సోనీ కోమండూరి నిశ్చితార్థం: ఘనంగా ముగిసిన వేడుక
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ టాలీవుడ్ సింగర్ సోనీ కోమండూరి వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. అభిరామ్ అనే వ్యక్తితో ఆమె నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖ గాయకులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. సింగర్ సాకేత్ కోమండూరి చెల్లెలైన సోనీ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుండగా, అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.