ముగిసిన తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు అధికారికంగా ముగిశాయి. మొత్తం 8 రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మరియు పాలన పరమైన పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సెషన్ ముగిసేసరికి సభలో మొత్తం నాలుగు ముఖ్యమైన బిల్లులకు ఆమోదం లభించింది. ఈ సమావేశాల సందర్భంగా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య పలు ప్రజా సమస్యలపై వాడీవేడీ చర్చలు జరిగాయి.