రాజాపేట మండలంలో వినాయక ఉత్సవాలపై పోలీసుల ఆంక్షలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం సమయంలో డీజేలను పూర్తిగా నిషేధించినట్లు ఎస్సై తక్కియుద్దీన్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి పది గంటల తర్వాత మైకుల వినియోగంపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. మంటపాల ఏర్పాటుకు పోలీసు, విద్యుత్ శాఖల ముందస్తు అనుమతులు తప్పనిసరి అని తెలిపారు.