ఆంధ్రప్రదేశ్లో నవంబర్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో నవంబర్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల పంతొమ్మిది కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. సుమారు ముప్పై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ధాన్యం విక్రయించిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే రైతులకు బిల్లులు చెల్లించేలా పారదర్శకమైన విధానం అమలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.