రూ. 267 కోట్లతో నర్సీపట్నం రూపురేఖలు మార్చామంటూ ఎంపీ విజయ్ ప్రచారం

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు కృషితో నియోజకవర్గంలో రూ. 267 కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.