రాజకీయ లబ్ధికే జూరాల ప్రాజెక్ట్ వద్ద బీఆర్ఎస్ ఆందోళనలు

రిపోర్టర్: గోపి స్థలం: జోగులాంబ గద్వాల

జూరాల ప్రాజెక్ట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే ఆందోళనలు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా మండిపడ్డారు. జూరాల జలాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే కర్ణాటక సీఎంతో మాట్లాడిందని, నీటి విడుదలపై త్వరలోనే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో తాగునీటి కోసం కనీసం మూడు టీఎంసీలు నిల్వ ఉండాలని, రైతులను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు.