ప్రయాణికులకు తీపి కబురు: ఒకే పాస్‌తో ఆర్టీసి, మెట్రో ప్రయాణం
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించిందని, ఆర్టీసీ బస్సులు మరియు మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు కామన్ ట్రావెల్ పాస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 2న ప్రజాభవన్‌లో జరిగే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ పాస్ ద్వారా ప్రయాణికులు పదేపదే టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా రోజువారీ, వారపు, నెలవారీ పాస్‌లను మొబైల్ యాప్ ద్వారా లేదా కౌంటర్ల ద్వారా సులభంగా పొందవచ్చని అధికారులు వెల్లడించారు.