ఒకే ఒక్క విద్యార్థి కోసం రోజూ 10 కిలోమీటర్లు నడుస్తున్న ఉపాధ్యాయుడు!

రిపోర్టర్: అశోక్ స్థలం: மகாராஷ்டிரா

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో జివన్ మిథారి అనే ఉపాధ్యాయుడు అంకితభావానికి ప్రతీకగా నిలుస్తున్నారు. రోడ్డు, కరెంట్ లేని మారుమూల అడవి ప్రాంతంలోని పాఠశాలలో కేవలం ఒక్క విద్యార్థి కోసం ఆయన గత 13 ఏళ్లుగా రోజూ ఐదు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి పాఠాలు చెబుతున్నారు. పులులు, చిరుతపులుల సంచారం ఉండే దట్టమైన అడవి మార్గంలో ఆయన పడుతున్న శ్రమ ఎంతో స్ఫూర్తిదాయకం.