విజయనగరం జిల్లాలో నామినేషన్ కేంద్రాల భద్రత పరిశీలన: ఎస్పీ దామోదర్
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో నామినేషన్ కేంద్రాల వద్ద చేపట్టిన భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ పర్యవేక్షించినట్లు విజయనగరం పోలీస్ వెల్లడించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా స్ట్రాంగ్ రూమ్స్ మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు బృందాలు పూర్తి అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.