అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ సుముఖం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
రిపోర్టర్: సతీష్
స్థలం: వాషింగ్టన్
అమెరికాతో ఒక ఒప్పందానికి ఇరాన్ రానుందని, త్వరలోనే డీల్ కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వాషింగ్టన్ లోనిలింకన్ మెమోరియల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్ ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగిందని, దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. అమెరికా సైనిక చర్యల కారణంగానే ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయని, త్వరలోనే ఇరాన్ తో సయోధ్య కుదిరే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.