మృత్యువు కబళించిన వేళ మొగిలిపాడు రహదారిపై క్షతగా్రతుడి విలవిల
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు వద్ద బైక్ పై ప్రయాణిస్తున్న బంగారు మల్లేష్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి వైద్యులు రెఫర్ చేశారు. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.