భారత జీడీపీ రానున్న రెండు దశాబ్దాల్లో ముప్పై ఎనిమిది ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్న అజిత్ డోభాల్

రిపోర్టర్: సునీల్ స్థలం: ఉత్తరాఖండ్

రానున్న ఇరై సంవత్సరాల్లో భారత జీడీపీ ముప్పై ఎనిమిది ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం నాలుగు ట్రిలియన్ డాలర్లుగా ఉన్న జీడీపీ భారీ మార్పులతో అద్భుతమైన భవిష్యత్తు వైపు దూసుకుపోతోందని, ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు 2047 వరకు ఉన్న సమయం నిజంగా అమృత కాలమని ఆయన అభివర్ణించారు.