ఫాంటసీ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ తొలిసారిగా ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూరి పాత్రలో ఫహద్ అభినయం, చిన్నారి దివ్య పాత్రలో సారా పాలేకర్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని సినీ విశ్లేషకులు తెలిపారు.