పోలింగ్ కేంద్రం పరిశీలన: ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదన్న కలెక్టర్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: సొర్వేపల్లి
సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పరిశీలించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మరింత అధికంగా పోలింగ్ శాతం నమోదయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశామని, సున్నిత ప్రాంతాల్ లో ప్రత్యేక వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణ కొనసాగుతోందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.