ఐఐటీ గాంధీనగర్ పీహెచ్డీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: గాంధీనగర్
ఐఐటీ గాంధీనగర్ 2026-27 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 28 సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. బయోలాజికల్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పలు విభాగాలలో పరిశోధక కోర్సులను అందిస్తున్నట్లు తెలిపింది. పీజీ లేదా నాలుగేళ్ల డిగ్రీలో కనీస మార్కులు సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐఐటీ యాజమాన్యం స్పష్టం చేసింది.