దేశంలో పేదరికం నిర్వచనం పూర్తిగా మారిపోయిందన్న నరేంద్ర మోదీ

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో దేశంలో పేదరికం నిర్వచనం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ఒకప్పుడు పేదరికం అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేకపోవడం అని, కానీ ఇప్పుడు ఇంట్లో కనీసం రెండు మోటార్ సైకిళ్లు లేని వారిని కూడా పేదవారిగా చూసే పరిస్థితికి దేశం చేరుకుందని ఆయన పేర్కొన్నారు. మోదీ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని స్పష్టం చేశారు.