రోడ్డు తనిఖీ సందర్భంగా వ్యక్తిపై చేయి చేసుకున్న మంత్రి పర్వేష్ వర్మ
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
న్యూఢిల్లీలో రోడ్డు తనిఖీ సమయంలో ఆప్ కార్యకర్త చెంపపై బీజేపీ మంత్రి పర్వేష్ వర్మ కొట్టడం తీవ్ర కలకలం రేపింది. తిలక్ నగర్లో కొత్తగా వేసిన రోడ్డు నాణ్యతను ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రోడ్డు పరిశీలనను వీడియో తీస్తున్న సాహిబ్ సింగ్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి చేయి చేసుకున్నారని బాధితుడు ఆరోపించారు. తన కుటుంబ సభ్యులను దూషించడం వల్లే అలా స్పందించినట్లు మంత్రి వివరణ ఇచ్చారు.