ఆందోళనల కాలమిది అంటూ సుప్రీంకోర్టు ప్రధాన జర్మనీ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల రిజర్వేషన్ల మార్పుపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన జస్టిస్ సూర్యకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి బదులుగా ఆందోళనలు చేపట్టవచ్చు కదా అని పిటిషనర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ జిల్లా కదిపూర్ నియోజకవర్గ వాసి జగదీష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ విచారణ జరిగింది. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆయన వాదించారు.