నీరందక అల్లాడుతున్న బొబ్బిలి ప్రజలను ఆదుకోవాలని కాంగ్రెస్ డిమాండ్

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో గత నాలుగు రోజులుగా తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మువ్వల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీరు అందించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన తాగునీరు సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని ఆయన పురపాలక అధికారులను కోరారు.