సినిమా రంగంలో వివక్షపై బాలీవుడ్ నటి కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: ముంబై
సినిమా పరిశ్రమలో మహిళలపై కొనసాగుతున్న వివక్షపై ప్రముఖ బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ తీవ్రంగా స్పందించారు. కేవలం అగ్ర హీరోలతో మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలు తీసే సంస్కృతి నుంచి మేకర్స్ బయటకు రావాలని ఆమె హితవు పలికారు. మహిళా ప్రధాన పాత్రలతో భారీ యాక్షన్ చిత్రాలు తీస్తే జనం ఆదరిస్తారని, అలాంటి సినిమాలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఓ ప్రైవేట్ వేడుకలో కృతి సనన్ స్పష్టం చేశారు.