ఆంధ్రప్రదేశ్ లో మాస్టర్ ప్లాన్లు లేక పక్కదారి పడుతున్న పట్టణాభివృద్ధి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీప ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు పుర, నగరపాలక సంస్థల్లో సరైన మాస్టర్ ప్లాన్లు లేకపోవడంతో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగడం లేదు. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మ అథారిటీ పరిధిలోని పలు మండలాలతో పాటు నెల్లిమర్ల, పాలకొండ, ఆకివీడు, మైదుకూరు వంటి పట్టణాల్లోనూ మాస్టర్ ప్లాన్లు కొరవడటంతో కనీస మౌలిక వసతులు, రహదారుల విస్తరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది.