ఐక్యరాజ్యసమితి సంస్కరణలపై భారత్ తీవ్ర అసంతృప్తి

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

ఐక్యరాజ్యసమితి పనితీరు, సంస్కరణల అంశంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యూయార్క్‌లో జరిగే ఐరాస వార్షిక చర్చల్లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. గ్లోబల్ సౌత్ దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో మరియు అంతర్జాతీయ సంక్షోభాలను పరిష్కరించడంలో ఐరాస విఫలమవుతోందని, శక్తివంతమైన దేశాలు తమ ప్రయోజనాలకే సంస్థను వాడుకుంటున్నాయని భారత్ అభిప్రాయపడింది.