రాజమండ్రి బీసీ గర్జనకు భారీగా తరలివెళ్లిన కుక్కునూరు వైసీపీ నాయకులు

రిపోర్టర్: venkat స్థలం: కుక్కునూరు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహిస్తున్న బీసీ గర్జన కార్యక్రమానికి ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నుంచి నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం వైసీపీ కట్టుబడి ఉందన్నారు. బీసీల సాధికారతకు తమ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను వివరించడానికి ఈ సభ వేదికగా నిలుస్తుందని, బీసీ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాడతామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.