కావలిలో ఘనంగా జాతీయ పోషణ మాస వేడుకలు

రిపోర్టర్: శివ స్థలం: కావలి

కావలి పట్టణంలో జాతీయ పోషణ మాసంలో భాగంగా ఆహార నాణ్యత పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఐసీడీఎస్ కావలి ప్రాజెక్ట్ సీడీపీవో రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆహారం వండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషక ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ కేంద్రాల సేవలతో పాటు మహిళా భద్రతా చట్టాలు, సఖి వన్ స్టాప్ సెంటర్ వివరాలను వివరించారు.