రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ కన్ఫర్మ్డ్ టికెట్ల బదిలీ వెసులుబాటు
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
రైలు ప్రయాణ సమయానికి అనివార్య కారణాల వల్ల ప్రయాణం వాయిదా పడితే కన్ఫర్మ్డ్ రిజర్వేషన్ టికెట్లను కుటుంబసభ్యులు లేదా ఇతర అర్హత కలిగిన వారికి బదిలీ చేసుకునే వెసులుబాటును భారతీయ రైల్వే కల్పిస్తోందని అధికారులు తెలిపారు. రక్తసంబంధీకులు, విద్యార్థులు, పెళ్లి బృందాలు అలాగే ఎన్సీసీ క్యాడెట్ల కోసం నిర్దిష్ట నిబంధనలకు లోబడి ప్రయాణానికి ముందుగానే రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకుని ఈ సేవలను వినియోగించుకోవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది.