ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సీతక్క ఆదేశం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో అక్టోబర్ 2న గ్రామసభల్లో ఎల్‌నినో యాక్షన్ ప్లాన్‌పై చర్చించి తీర్మానాలు చేయాలని, ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకుంటూ జలసిరి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆమె సూచించారు.