సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యంపై విద్యుత్ శాఖకు మొట్టికాయలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: మేడ్చల్-మల్కాజిగిరి
నిర్దేశిత గడువులోగా సమాచారం అందించడంలో విఫలమైన జగద్గిరిగుట్ట విద్యుత్ శాఖ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికి తెలంగాణ సమాచార కమిషన్ రూ.వెయ్యి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ముందస్తు నోటీసులు లేకుండా ఇంట్లోకి ప్రవేశించి విద్యుత్ నిలిపివేసిన లైన్మన్పై చర్యల వివరాలు కోరినా అధికారులు స్పందించకపోవడంతో బాధితుడు కమిషన్ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కమిషన్ బాధితుడికి పరిహారంతో పాటు రెండు వారాల్లోపు పూర్తి సమాచారం అందించాలని స్పష్టం చేసింది.