తుపాను ప్రభావం: విజయనగరం మీదుగా రాకపోకలు సాగించే పద్దెనిమిది రైళ్లు రద్దు
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయనగరం
తుపాను కారణంగా విజయనగరం మీదుగా వెళ్లే పద్దెనిమిది రైళ్లను రద్దు చేసినట్లు స్టేషన్ మేనేజర్ ఎస్వీబీ రావు తెలిపారు. ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశామని ఆయన పేర్కొన్నారు. అలాగే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అదనపు బస్సులు నడిపినప్పటికీ, తుపాను ఉద్ధృతి కారణంగా ఆశించిన స్థాయిలో భక్తులు రాలేదని విజయనగరం డిపో ప్రబంధకుడు జె.శ్రీనివాసరావు వెల్లడించారు.