కాళీఘాట్‌లో చేపల ప్రసాదం తిన్న సీఎం సువేందు అధికారి

రిపోర్టర్: శివ స్థలం: पश्चिम बंगाल

కౌశిక్ అమావాస్య సందర్భంగా కోల్‌కతాలోని కాళీఘాట్‌ను సందర్శించిన సీఎం సువేందు అధికారి అమ్మవారికి సమర్పించిన చేపల ప్రసాదాన్ని భుజించారు. దుర్గాపూజ వేళ మాంసాహారం తినరాదంటూ ఇటీవల ఓ సాధువు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో, బెంగాలీ సంప్రదాయాలను గౌరవిస్తామని స్పష్టం చేస్తూ ఆయన ఈ భోజనం చేశారు. ఈ చర్యతో వెజ్, నాన్‌వెజ్ వివాదానికి తెరపడింది.